Aadhaar Update: ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమా పథకాల నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆదార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్యే వస్తుంది. గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే వీలు ఉండేది. కానీ, అది అంత ఈజీ కాదని చెప్పాలి. ఎందుకంటే రూల్స్ మారాయి. ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా మార్పులు చేయాలంటే రూల్స్ కఠినతరం చేసింది ఆధార్ జారీ సంస్థ ఉడాయ్.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా తప్పులు ఉన్నా, అక్షరాల్లో మార్పులు చేయాలన్న ఇకపై తప్పనిసరిగా గెజెట్ నోటిఫికేషన్ కావాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డుదారుడి పూర్తి పేరును సూచించే మరో గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అందులో పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ, పాస్‌పోర్ట్ వంటివి ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. ఆధార్ కార్డులోనే పేరులో చాలా మందికి తెలుగు, ఇంగ్లీష్ విషయంలో అక్షరాల్లో తేడా వస్తుంటుంది. దీంతో కొన్ని సార్లు పేర్లు సరిపోలక కొన్ని పథకాలు కోల్పోవాల్సి వస్తుంది. వారందరుకూ కచ్చితంగా అన్ని గుర్తింపు కార్డుల్లో ఒకే విధంగా, ఒకే విధమైన అక్షరాలతో కార్డులను అప్డేట్ చేసుకోవాలి. మరి మీ ఆధార్ కార్డులో పేరు అప్డేట్ చేసుకోవాలంటే గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గుర్తుంచుకోండి.