ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 3 నుంచి నవంబర్ 9, 2024 వరకు): మేష రాశి వారికి ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం మొదలు శనివారం వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వారమంతా అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతుంది. కానీ, కుటుంబ ఖర్చులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవడం అవసరం. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సాధారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, ఊరట కలుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు సంతృప్తిని కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అనుకోకుండా మంచి వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి. చదువులు, పరీక్షలకు సంబంధించి పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎటువంటి కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని ఊహించని శుభవార్తలు వింటారు. హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రల ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి మంచి అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆదాయం నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పుల చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధార పడే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులు మీ వల్ల బాగా లాభ పడతారు. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగ్య, లాభస్థానాలు బలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఇంట్లో శుభ కార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. తోబుట్టువు లతో సమస్యలు, వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. పిల్లలు చదువుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నం దువల్ల ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది. వ్యాపారాల్లో అంచ నాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ధనపరంగా ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశిలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, ఈ కలయికను గురువు వీక్షించడం తదితర కారణాల వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధనాదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో మీ సమర్థతను గుర్తించి అధికారులు కొత్త బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. సామాజికంగా కూడా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆహార, విహారాల్లోనే కాకుండా, ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి సంబంధం విషయంలో బంధు వుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గ్రహ సంచారం కాస్తంత బాగున్నందువల్ల ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సునాయాసంగా పూర్తి చేయడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కా రమయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ధన, లాభాధిపతులు అనుకూలంగా ఉన్నందువల్ల అనేక వైపుల నుంచి బాగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన శుభవార్తలు అందు తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. అదనపు ఆదాయానికి సంబంధించి కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయానికి సంబంధించినంత వరకూ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ, ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ఇంటా బయటా శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయట పడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగే సూచనలున్నాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. బంధువుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగుల ప్రయత్నాలకు అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం ఆనందంగాసాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గే అవ కాశం ఉంది. భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో పదవీ యోగం పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా ఇతరత్రా కూడా గౌరవాభిమా నాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జర గడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవు తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు.

About amaravatinews

Check Also

Horoscope Today: ఆదాయ ప్రయత్నాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *