హైదరాబాద్‌లో కొత్త రైల్వేస్టేషన్.. త్వరలోనే ప్రారంభం.. ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా ఇదే..!?

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తికావొచ్చింది. సుమారు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అవతరిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే ఉన్న.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరగటంతో పాటు.. వాళ్ల సౌకర్యార్థం నడుపుతున్న రైళ్ల రాకపోకలు కూడా పెరుగుతుండటంతో.. ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేస్తోంది.

సుమారు రూ.430 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా సకల హంగులతో.. రెండు అంతస్తుల్లో ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 9 ప్లాట్ ఫాంలు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 5 ప్లాట్ ఫాంలు ఉండగా.. కొత్తగా మరో నాలుగింటిని అభివృద్ధి చేశారు.

అయితే.. ఇప్పటికే చిన్న చిన్న పనులు మినహా రైల్వేస్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తవగా.. తుది మెరుగులు దిద్దుతున్నారు. అవి కూడా పూర్తయితే.. త్వరలోనే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కానీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీలుచూసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇప్పటికే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్.. స్టేషన్‌ను పరిశీలించారు.

మరోవైపు.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను చేరుకునేలా ప్రభుత్వ.. రోడ్లను విస్తరించే పనులను కూడా చేపట్టింది. ప్రస్తుతం ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేలా.. 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేలా రైల్వేబోర్డు నుంచి అనుమతులు లభించాయి. ప్రారంభించటమే తరువాయి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే రెడీగా ఉంది. అయితే.. ఈ రైల్వేస్టేషన్ నుంచి ఏ ఏ రైళ్లు నడుపనున్నారన్న వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించకపోయినా.. నడిచే రైళ్లు, ఆపే రైళ్ల జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు

  • 12589/12590 గోరఖ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ – గోరఖ్ పూర్
  • 12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌
  • 12604 హైదరాబాద్ – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌
  • 18045 షాలిమార్‌ – హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌
  • 18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌

చర్లపల్లి స్టేషన్‌లో ఆగే రైళ్ల వివరాలు

  • 12705/12706 గుంటూరు – సికింద్రాబాద్‌ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌
  • 17011/17012 హైదరాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌
  • 12757/12758 సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌
  • 17201/17202 గుంటూరు – సికింద్రాబాద్‌ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌
  • 17233/17234 సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌
  • 12713/123714 విజయవాడ – సికింద్రాబాద్‌ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌

About amaravatinews

Check Also

అయ్యో! ఎంతపని చేశావమ్మా.. అవమానంతో ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య!

మాటిమాటికీ పోలీసులు ఇంటికి రావడం.. అనుమానం, దర్యాప్తు పేరిట భర్తను అరెస్ట్ చేయడం, ఇంట్లో సోదాలు చేయడంతో ఆ ఇల్లాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *