స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఒక అంచనా ఉండాలి. అంటే కనీసం దీనిపై అవగాహన ఉండాలి. ఇందుకోసం స్టాక్ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తుండాలి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ఒప్పందాలు, ప్రణాళికలు ఇలా అన్నింటిపైనా అవగాహన ఉండాలి. అప్పుడే.. మంచి స్టాక్ ఎంచుకునేందుకు దోహదం చేస్తుంది. ఇంకా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. స్టాక్స్‌లో షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ రన్‌లోనే చాలా వరకు షేర్లు మంచి …
Read More »Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. సీఐడీ కేసు నమోదు.. ఆ ఫిర్యాదుపైనే..
సినీనటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు రాగా.. తాజాగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కీసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ …
Read More »Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ రూట్లలోనే..!
Vande Bharat Express: 2019లో రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోల్చితే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా రైలు ప్రయాణికులకు మాత్రం వేగం, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక ఈ సెమీ హెస్పీడ్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణికుల నుంచి ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని యోచించిన రైల్వే శాఖ వచ్చే ఏడాది వాటిని …
Read More »అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను …
Read More »ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మకు షాక్.. నో చెప్పిన ధర్మాసనం, కీలక ఆదేశాలు
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. సోమవారం హైకోర్టులో పిటిషన్ పై విచారణ చేయగా.. పిటిషనర్‌కి నోటీసులు జారీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ లాయర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించగా.. పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారన్న ఆర్జీవీ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. వాస్తవానికి మద్దిపాడు …
Read More »తాడిపత్రి: తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలో నవ వధువు మృతి, మాటలకందని విషాదం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాద ఘటన జరిగింది. తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలో నవ వధువు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.. వీరిలో పెద్ద కూతురు గీతావాణికి పెళ్లి కుదిరింది.. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్‌వీ ఫంక్షన్ హాలులో ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. వధువు గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రి వెళ్లారు. అక్కడ పనులు చక్కబెట్టుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి …
Read More »భారీ భద్రతా వైఫల్యం.. బ్రిటన్ రాజసౌధంలోకి చొరబడ్డ ముసుగు దొంగలు.. !
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్ (King Charles) దంపతులు అప్పుడప్పుడు సేదదీరే విశ్రాంతి మందిరం విండ్సర్ క్యాజిల్ (Windsor Castle)లోకి చోరులు ప్రవేశించారు. ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ట్రక్కు, బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రాజ కుటుంబానికి చెందిన ఎవరూ అక్కడ లేనప్పటికీ.. ఈ ఘటన ఎస్టేట్ భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా …
Read More »విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు
నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు. ఈ నెల 16న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, …
Read More »కర్నూలు: హాస్టల్ కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9మందికి అస్వస్థత, కారణం తెలిసి షాక్
కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసి ఆకతాయి పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు సి క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్ ఉంది. ఈ వసతి గృహంలో వివిధ తరగతులు చదువుతున్న 30 మంది ఉంటున్నారు. వీరిలో ఒక పీజీ విద్యార్థి కూడా ఉండగా.. విద్యార్థుల మధ్య అతడు తరచూ వివాదాలకు కారణం అవుతున్నాడు. హాస్టల్‌లో విద్యార్థుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా పీజీ విద్యార్థి, మరో 8వ తరగతి చదువుతున్న మరో బాలుడితో కలిసి మాస్టర్ ప్లాన్ …
Read More »వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు, ఎందుకంటే
ఏపీలో సంచలన రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో ఇవాళ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 2021లో కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ఇప్పుడు వాంగ్మూలం రికార్డు …
Read More »