amaravatinews

HYD: బాలుడి ప్రాణం తీసిన బడి గేటు.. విరిగిపడటంతో ఒకటో తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు మీద పడటంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం (నవంబర్ 4) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, సరోజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ (6) హయత్‌నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం …

Read More »

కోనసీమ కుర్రోడు, కెనడా అమ్మాయి.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఆ ఊర్లో సందడే, సందడి

తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. అక్కడి అమ్మాయి, అబ్బాయిల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలు దాటింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అబ్బాయి.. కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని …

Read More »

ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.35వేల నుంచి రూ.లక్షకు పెంపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గృహనిర్మాణంపై సమీక్ష చేసిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై వివరించారు. డిసెంబరులో పీఎంఏవై 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేలా కేంద్ర …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు తీపికబురు.. డిసెంబర్‌లో పక్కా, ఇకపై సరికొత్తగా!

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం మెనూ మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమలు చేస్తుండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మోనూ సిద్ధం చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై మూడు నుంచి నాలుగు రకాల మెనూలు అమలు చేయాలని భావిస్తున్నారు.. వాస్తవానికి జిల్లాకో మెనూ అమలు చేయాలని అనుకున్నారు.. కానీ కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్‌కు ఒక మెనూ ఉండాలని నిర్ణయించారు. మంగళగిరిలో డొక్కా సీతమ్మ …

Read More »

ఏపీలో ప్రభుత్వానికి మరో బ్యాంక్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) ఉద్యోగులు రూ.1.16 కోట్ల విరాళాన్ని అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సహకార శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌బాబు, బ్యాంకు ఎండీ డా.ఆర్‌.ఎస్‌.రెడ్డి, సీజీఎంలు ఎన్‌.వెంకటరత్నం, రామచంద్రయ్య, ఉద్యోగులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాయచోటి నియోజకవర్గ వ్యాపారులు, వర్తక సంఘాల తరఫున రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మరోవైపు ఏపీలో …

Read More »

బద్దలైన అగ్నిపర్వతం.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. 9 మంది మృతి, భయానక వీడియో

ఇండోనేసియాలో మౌంట్‌ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలో ఉన్న ఈ అగ్విపర్వతం గురువారం నుంచి రోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని నుంచి లావా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలు కాలిబూడిదవుతున్నాయి. దీని ధాటికి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అగ్నిపర్వతం విస్ఫోటనాలు ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని హెచ్చరించారు. అగ్నిపర్వతం విస్ఫోటనంతో విద్యుత్ సరఫరాకు …

Read More »

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం.. పుట్టిన రోజునే శ్రీకారం..!

సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం …

Read More »

అంబానీ మాస్టర్ ప్లాన్.. JIO ఐపీఓ ముహూర్తం ఖరారు.. ఆ తర్వాతే రిటైల్ పబ్లిక్ ఇష్యూ!

JIO IPO: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో రెండు ఐపీఓలు త్వరలోనే స్టాక్ మార్కెట్లలోకి రానున్నాయి. దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు అంబానీ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. జియో వచ్చే ఏడాది తొలి నాళ్లలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 100 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మార్కెట్లలోకి అడుగు పెట్టాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్ విభాగం పబ్లిక్ ఇష్యూకు కాస్త …

Read More »

Pawan Kalyan: పరిస్థితి చేయిదాటితే నేనే హోంమంత్రి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతి, భద్రతలపైనా, హోం శాఖపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో.. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖ మంత్రిని …

Read More »

Uttarakhand: ఘోర ప్రమాదం.. బస్సు లోయలోకి దూసుకెళ్లి 23 మంది మృతి

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు అల్మోరా జిల్లాలోని మర్చులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. కుపి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల …

Read More »