amaravatinews

YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరిపై అయినా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాలలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ విబేధాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తల్లీ, …

Read More »

ఒక్కడిని చేసి దాడి.. కట్ చేస్తే.. ప్రమాదం జరిగి ఒళ్లంతా గాయాలు.. అంతా కర్మ ఫలితమేనా!

సత్కర్మభీశ్చ సత్ఫలితం.. దుష్కర్మ ఏవ దుష్ఫలం.. అత్యుత్కట పుణ్యపాపానాం సత్యంబలానుభవమిహం.. పురాణాల్లో ఉన్న శ్లోకమిది. మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితమూ, చెడ్డ పనులు చేయడం వల్ల చెడు ఫలితమూ వస్తాయని.. ఏదైనా మనం చేసిన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనని చెప్పేదే కర్మ సిద్ధాంతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ కథనం, ఫోటోలు, వీడియోలు చూస్తే.. కర్మ సిద్ధాంతం నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడనే …

Read More »

వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి విరాంజనేయస్వామి, మండలిలో ప్రతిపక్ష నేత …

Read More »

Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే!

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–175-195 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–85-112 సీట్లుఇతరులు–7-12 కేకే సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56ఇతరులు-07 రిపబ్లిక్ సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు మ్యాట్రిజ్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు పీ మార్క్ మహాయుతి(బీజేపీ-షిండే …

Read More »

హైదరాబాద్‌లో భారీ స్కామ్.. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి నిండా ముంచేశారు

రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్‌పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ …

Read More »

ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ అలుపెరగని ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 340 కి.మీ ప్రేమయాత్ర..!

ప్రేమ, విరహం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. అందుకు సరైన ఉదాహరణ టైగర్ జానీ అనే పెద్ద పులి. ఆడ తోడు కోసం ఈ టైగర్ అలుపెరుగని ప్రయాణం సాగిస్తోంది. ఒకటి కాదు‌ రెండు కాదు ఏకంగా నెల రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 340 కి.మీ దాటిన ప్రేమయాత్ర ఇంకా సాగుతూనే ఉంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటి తెలంగాణ కవ్వాల్ అభయారణ్యంలోకి చేరుకుంది. నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద ఈనెల 11న ఓ పులి …

Read More »

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని.. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీకి రెఫర్‌ చేసి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల …

Read More »

శ్రీ శృంగేరి శారదా పీఠానికి వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే, ఎందుకెళ్లారంటే!

విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అక్కడ జగన్ దాదాపు గంటసేపు గడిపారు. స్వామిజీతో చర్చించిన అంశాలను వెల్లడించలేదు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ వెళ్లిపోయారు. జగన్‌తో వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా …

Read More »

AP News: ఇద్దరు ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి.. కోనసీమలో సందడే, సందడి

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐఏఎస్‌ శిక్షణలో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లిని ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడి స్వగ్రామం ఈ పెళ్లి వేడుకకు వేదిక అయ్యింది.. సందడి వాతావరణం కనిపించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన తరెట్ల ధర్మారావు ఐఏఎస్‌ అధికారి.. మధ్యప్రదేశ్‌‌లో కమిషనర్‌ స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ …

Read More »

Lagacharla incident: పట్నం మహేందర్ రెడ్డికి ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఈనెల 11న ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా.. హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పట్నం వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో అందరు ఖైదీలతో ఉంచకుండా స్పెషల్ …

Read More »