తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …
Read More »పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో వాలంటీర్ల ట్విస్ట్, కోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట దక్కింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని ఎన్టీఆర్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రత్యేక …
Read More »ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ)లో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఆ శాఖ ఎండీ చెక్ పెట్టారు. పొరుగుసేవల కింద పనిచేస్తున్న 45 మందిని.. అంతేకాదు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న 50 మందిని తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగించారు. ఈ 95మందికి ఐదేళ్లపాటు జీతాలు చెల్లించడంతో ఏపీఎండీసీపై అదనపు …
Read More »లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్ల తగ్గింపు.. బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన!
Intrest Rates: ప్రస్తుతం బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రుణాలపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. కేంద్ర మంత్రి సూచన మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రుణగ్రహీతలపై భారం తగ్గనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులకు …
Read More »బీజేపీకి బిగ్ షాక్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ప్రాంతీయ పార్టీ
మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో తెగల మధ్య హింసాత్మక సంఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ -ఎన్‌పీపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. అయితే ఇప్పటికే కుకీ పీపుల్స్ పార్టీ కూటమి నుంచి వైదొలగగా.. ఇప్పుడు ఎన్‌పీపీ కూడా అదే బాటలో బయటికి రావడం మణిపూర్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను.. పదవి నుంచి …
Read More »తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా.. మంత్రి కీలక ప్రకటన
Telangana 4 New Airports: తెలంగాణలో ప్రస్తుతం.. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుతో పాటు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమనాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎయిర్ పోర్ట్ విస్తరణకు 256 ఎకరాలు అవసరముండగా.. అందుకోసం పరిపాలనా అనుమతులు ఇస్తూ.. 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ …
Read More »TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత …
Read More »ఎంతమంది పిల్లలు ఉన్నా ఓకే.. కీలక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ నిబంధనలు మార్చే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను మారుస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో మున్సిపల్, శాసనాల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ …
Read More »కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు..!
ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడుతున్న యువత సర్వం కోల్పోతున్న సంగతి తెలిసిందే. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి చిత్తవుతున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు. అటువంటి వీడియోనే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఓ యువకుడు తక్కువ సమయంలోనే ఈజీగా …
Read More »మంగళగిరిలో అఘోరీ రచ్చ రచ్చ.. పోలీసులపై దాడికి యత్నం.. చివరకు అలా..
రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న అఘోరీ సోమవారం మంగళగిరిలో హంగామా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జాతీయ రహదారిపై హల్‌చల్ చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై బైఠాయించిన అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరి జనసేన కార్యాలయంలో లేరు. ఇదే విషయాన్ని అఘోరీకి చెప్పిన పోలీసులు అక్కడి …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal