Kadam

ఆంధ్రప్రదేశ్‌లోని పాకిస్థాన్ కాలనీ పేరు మార్పు.. కొత్తగా ఏ పేరు పెట్టారంటే?

విజయవాడ అర్బన్ డివిజన్ 62లో ఉన్న పాకిస్థాన్ కాలనీకి భగీరథ కాలనీగా నామకరణం చేశారు అధికారులు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు పేరు మార్చడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం భగీరథ కాలనీగా పేరు మార్చడం జరిగింది..విజయవాడలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ పేరుతో పిలవబడుతున్న కాలనీ పేరు ఇకపై మారిపోయింది. ఎట్టకేలకు ఆ ప్రాంత వాసుల ఆందోళనకు ప్రతిఫలం లభించింది. తాజాగా ఆధార్‌ …

Read More »

రైల్వేలో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో RPF కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. గతేడాది ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చినా .. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్ డేట్ లు వెలువడకపోవడంతో అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయడంతో వీరి ఎదురు చూపులకు తెరపడినట్లైంది..దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ నియామకాలకు …

Read More »

ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పులేంది సామీ..?

ఒకవైపు పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్ధుల్లో ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఇంటర్ బోర్డు వింత ప్రకటన జారీ చేసింది. ఉన్నట్లుండి ఇంటర్ లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్ధులు అంతా గందరగోళంలో పడిపోయారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన …

Read More »

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం..

భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. …

Read More »

ఏపీలోకి ఎంటరైన 30 మంది మావోయిస్టులు.. DGP షాకింగ్‌ వ్యాఖ్యలు!

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఆపరేషన్ కతార్ పేరుతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా చతిస్‌ఘడ్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు అందరిలో అలజడ రేపుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురు దెబ్బగానే అంతా భావిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందగా ఆయన మృతదేహానికి శ్రీకాకుళం జిల్లాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. …

Read More »

రాకెట్‌ ప్రయోగాలు శ్రీహరికోట నుంచే ఎందుకు? ప్రధాన కారణాలు ఇవే!

రాకెట్స్‌ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట గురించి అందరికి తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పెస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే రాకెట్ల ప్రయోగం కోసం శ్రీహరికోటనే ఎందుకు ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, ఇక్కడే ఉందుకు? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు ఇస్రో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇస్రో తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం ఏపీలోని నెల్లూరులోని శ్రీహరి కోట …

Read More »

భోజనానికి అన్నా క్యాంటిన్‌ వెళ్తున్నారా.. వారికి కండిషన్స్ అప్లై..!

ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు.. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చుతోంది అన్న క్యాంటిన్. జస్ట్‌ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు.మద్యం తాగి వస్తే ముద్ద పెట్టం.. ఇదీ ఒంగోలు కొత్తపట్నం …

Read More »

నాగోరే నాగోబా.. దారులన్నీ కేస్లాపూర్ వైపే.. మహా జాతరకు వేళాయే..

నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతోంది. జనవరి 28న మొదలై ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర సాగనుంది.తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు …

Read More »

త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్యా.. గురుకుల విద్యాలయాల్లో త్వరలో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డిగ్రీ కోర్సులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో ప్రస్తుతం 5 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బాల బాలికలకు ప్రభుత్వం విద్యను అందిస్తుంది. …

Read More »

మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని.. సూచించారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడానికి సూర్ సిక్స్‌ హామీలు కూడా ప్రధాన కారణం. ప్రభుత్వంపై దాదాపు రూ. 9లక్షల కోట్ల అప్పుల భారం …

Read More »