కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో TGPSC కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో TGPSC కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న …
Read More »మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
పీజీ మెడికల్ సీట్ల స్కామ్‌లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీమంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 …
Read More »మళ్లీ ఆర్థిక వివాదాల్లో వైసీపీ అధినేత.. అసత్యాలు ప్రచారం చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉండగా సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు చేసుకున్న ఒప్పందాలపై వస్తున్న విమర్శలు వైఎస్ జగన్ చుట్టూ ముసురుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులో నమోదైన కేసులు రాజకీయంగా తీవ్ర వివాదాలకు కారణం కాగా, అధికారాన్ని చేపట్టిన తర్వాత అదానీతో చేసుకున్న ఒప్పందాలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్లకు ఆశపడి చేసుకున్నారంటూ వైసీపీ అధినేత పై విమర్శల అధికార పార్టీ దాడి చేస్తుంది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
Read More »నర్మదా నది నుంచి బయటపడుతున్న బంగారు నగలు.. మోహరించిన పోలీసులు
జబల్‌పూర్‌లోని నర్మదా నదిలో బయల్పడిన ఇప్పటివరకు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. గౌరీఘాట్ ప్రాంతంలోని భటోలి నిమజ్జన చెరువులో చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు పడేస్తుంటారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు లక్షల విలువైన నగలను నర్మదా నదిలో పడేసేవారు. అయితే పోలీసులు చాలా శ్రమించి దొంగను పట్టుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాల ఘటనలను ఛేదించేందుకు పోలీసులు రకరకాలుగా ప్రయత్నాలు …
Read More »ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!
ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు …
Read More »గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. గండికోట, రాజమండ్రి పుష్కర్ ఘాట్ డెవలెప్‌మెంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడమే అందుకు నిదర్శమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.ఆంధ్రప్రదేశ్ లోని రాజుల పరిపాలనకు సజీవ సాక్ష్యం అయిన గండికోట అభివృద్ధికి కేంద్ర టూరిజం శాఖ 77.91 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని గండికోట, పుష్కర్ ఘాట్‌కు కేంద్ర టూరిజం శాఖ నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై …
Read More »ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …
Read More »పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?
తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది. రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే …
Read More »ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది.. నయనతార చెప్పిన కర్మ సిద్ధాంతం.. ధనుష్ గురించేనా.. ?
హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే సుమారు మూడు పేజీలతో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది నయన్. హీరో ధనుష్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది.లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్‌గా ఉన్న వార్.. ఇప్పుడు రచ్చకెక్కింది. నానుమ్ రౌడీ సినిమా నుంచి మూడు సెకన్ల వీడియో ఉపయోగించినందుకు …
Read More »కొనసాగుతున్న మహా సస్పెన్స్.. మహాయుతి కీలక భేటీకి అమావాస్య ఎఫెక్ట్..
మహారాష్ట్ర సీఎం ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా మహాయుతి నేతల కీలక సమావేశం రద్దవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అమావాస్య కారణంగానే మహాయుతి మీటింగ్ రద్దైనట్లు తెలుస్తోంది. రెండ్రోజులపాటు శుభముహూర్తాలు లేకపోవడం సమావేశాన్ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ లేదా ముంబై ఈ సమావేశం నిర్వహంచనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ రద్దవ్వడంతో షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. రెండ్రోజులపాటు అక్కడే ఉండి… ఆదివారం నాటి మీటింగ్‌కు హాజరవుతారంటూ శివసేన నేతలు చెబుతున్నారు. అయితే షిండే ఇంకా అసంతృప్తితో …
Read More »