Kadam

 గుడ్‌న్యూస్‌.. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!

AP Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం పథకం …

Read More »

అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్!

2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్టులో విద్యా, పురపాలక, తెలుగు భాషాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మున్సిపాలిటీలకు స్వయం పాలన, తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు ప్రముఖ అంశాలను ప్రస్తావించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు, మద్యపాన నిరోధక ప్రచారాలకు కూడా నిధులు కేటాయించారు.2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక …

Read More »

3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండగా.. రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162 కోట్లని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు పయ్యావుల. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు …

Read More »

ఇది పండు కాదు బ్రహ్మాస్త్రం.. నారింజ రోజూ ఒకటి తింటే దివ్యౌషధం అంట.. తాజా అధ్యయనంలో..

రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల వైద్యుడికి దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు.. ఆపిల్ ఒక్కటే కాదు.. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ తినడం ద్వారా.. మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంటారని.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం వల్ల ఒక వ్యక్తిలో డిప్రెషన్ 20 శాతం …

Read More »

తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్‌ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!

ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్‌తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.ఏపీ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, …

Read More »

ఎలాంటి ఫీజు లేకుండా దక్షిణ కొరియాలో చదువుకునే ఛాన్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే విద్యార్ధులకు అద్భుత అవకాశం. దక్షిణ కొరియాలోని పలు యూనివర్సిటీల్లో చదువుకునేందుకు సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులెవరైనా దక్షిణ కొరియాలో పీజీ కోర్సులు చదవొచ్చు..దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులకు …

Read More »

తెలంగాణ నెల ఆదాయం ఎంత..? అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు..?

తెలంగాణలో ఆదాయ-వ్యయాలు ఎలా ఉన్నాయి. నెలవారీ వస్తున్న వసూళ్లెంత?. ఖర్చవుతుంది ఎంత?. అభివృద్ధి, సంక్షేమానికి నిధుల కొరత ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. నెలవారీ ఆదాయం మరో 4వేల కోట్లు పెరిగితే తప్ప.. ఆర్థిక పరిస్థితి మెరుగు పడదు అంటున్నారు సీఎం. మరి.. ఆ 4వేల కోట్ల ఆదాయం పెరిగేందుకు ఏం చేయబోతున్నారు?. ఎలా ఖజానా నింపబోతున్నారు..?తెలంగాణ ఆర్థిక కష్టాలను క్లియర్‌ కట్‌గా బయటపెట్టారు సీఎం రేవంత్. నెలవారీ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఎంత, దేనికి ఎంత ఖర్చవుతుంది?.. అభివృద్ధి, సంక్షేమానికి నిధులపై …

Read More »

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం.. మార్చి 1 నుంచి పది లక్షల విద్యార్ధులకు పరీక్షలు షురూ!

2024-25 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!

ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని …

Read More »

 వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్‌ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.ఒంగోలు డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవ్‌తో పాటు పార్టీ …

Read More »