ఆంధ్రప్రదేశ్

సోదర బంధానికి రక్ష! రక్ష!

శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. నేడు రాఖీ పౌర్ణమి శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో… పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. …

Read More »

Donations: అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువ.. రూ.కోటి అందజేసిన మాజీ ఎంపీ

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేదలకు రూ.5లకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. మర్నాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు …

Read More »

Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …

Read More »

Employees transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. గైడ్‌లైన్స్ విడుదల.. వారికి మాత్రం!

AP Govt Employees transfer Guidelines: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్‌లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ …

Read More »

కర్నూలు వ్యక్తికి సారీ చెప్పిన లోకేష్.. అసలేమైందంటే?

Nara Lokesh sorry to complainant:ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన తరుఫున, తన విభాగం తరుఫున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రజాదర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్.. …

Read More »

వైసీపీ కార్యాలయం కూల్చివేతకు కారణమదే.. ఆళ్ల నాని

YSRCP Office Demolished in Eluru: ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపై మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆళ్ల నాని.. కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి …

Read More »

పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,

ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …

Read More »

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్‌ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్‌ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …

Read More »

అనకాపల్లి జిల్లాలో అరుదైన పురుగు.. ధర ఏకంగా రూ.75 లక్షలు?, ఎందుకంత డిమాండ్!

ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోనాంలో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కీటకం ధర రూ.75 లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కీటకానికి అంత ధర ఏంటి అని షాకవ్వకండి.. ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలు కలిగిన అరుదైన కీటకం స్టాగ్ బీటిల్ అని చెబుతుంటారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధర కంటే …

Read More »

విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ యాప్‌లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపటిలాగే.. మొబైల్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు కట్టేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా.. జులై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు.. థర్డ్ పార్టీ యాప్‌లలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్‌ యాప్‌లు, …

Read More »