తెలంగాణ

కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్‌, జగన్‌ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …

Read More »

అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..

భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు …

Read More »

సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …

Read More »

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్‌ పాలసీ అడ్వైజర్‌ డా.అంజనా అగర్వాల్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ …

Read More »

రైతులకు సంకెళ్లు.. రేవంత్ సర్కార్ ఆగ్రహం.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్..

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్‌ఎస్సై , ఇద్దరు ఏఆర్‌ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తర్వులు …

Read More »

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీపాయింట్‌ …

Read More »

డిగ్రీ అర్హతతో ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూదిల్లీ, ఈశాన్య జోన్‌లలో ఖాళీగా ఉన్న..భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో …

Read More »

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న …

Read More »

ఇంటర్‌ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 17 నుంచి జూన్‌ 23వ …

Read More »

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు! పరుగులు తీసిన సిబ్బంది

హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, CISF, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాన్ని ఖాళీ చేసి, బాంబు నిర్మూలన బృందం తనిఖీలు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది.ఇటీవలె అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో.. ప్రజల్లో విమానం పేరు వింటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. …

Read More »