తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలు, కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ EV నరసింహా రెడ్డి గురువారం బెంగళూరులో EkStep ఫౌండేషన్‌ను సందర్శించారు..తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, పాఠశాల …
Read More »ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా …
Read More »బిగ్ అలర్ట్.. తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు!
GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే …
Read More »ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..
ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.30 డిపార్ట్ మెంట్ లు,2వేల పడకలు,ఫిజియోథెరపీ ,డెంటల్, కాలేజ్ లు,హాస్టల్ వసతి తో …
Read More »తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?
ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ …
Read More »ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …
Read More »టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి …
Read More »తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, …
Read More »మృత్యు లారీలు.. హైదరాబాద్‌లో హెవీ వెహికిల్స్ ఎంట్రీపై టీవీ9 ఎఫెక్ట్.. పోలీసుల అలర్ట్..
షేక్‌పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్‌లు విధించారు.ప్రజల ప్రాణాలంటే వేళాకోలంగా ఉందా?…లారీలను, హెవీ వెహికల్స్‌ను వేళాపాళాలేకుండా సిటీలోకి ఎలా అనుమతిస్తున్నారు? నో ఎంట్రీ నిబంధనలు తుంగలో తొక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? నో ఎంట్రీ టైమ్‌లో సిటీలోకి దూసుకొచ్చిన లారీ …
Read More »ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్ ప్రశ్నపత్రంలో మార్పులేంది సామీ..?
ఒకవైపు పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్ధుల్లో ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఇంటర్ బోర్డు వింత ప్రకటన జారీ చేసింది. ఉన్నట్లుండి ఇంటర్ లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్ధులు అంతా గందరగోళంలో పడిపోయారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన …
Read More »