తెలంగాణ

తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. 10 మంది TGSP పోలీసులు డిస్మిస్

తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన …

Read More »

హైదరాబాద్‌ మెట్రో సెకండ్ ఫేజ్.. కేబినెట్ కీలక నిర్ణయం, ఇక ఆ ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణం

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సిద్ధమైంది. తాజాగా.. హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – …

Read More »

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్‌లోనే!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్‌ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ …

Read More »

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!

తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి …

Read More »

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం …

Read More »

నేను కూడా పంపిస్తా.. కాచుకో.. కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు. “కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు …

Read More »

యాదాద్రి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి గుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం.. ఈవో అధికారిక ప్రకటన

Photos Videos ban in Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం …

Read More »

నీ అయ్య లెక్క అందరూ ఉండరు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్.. నెటిజన్ల ఘాటు కామెంట్లు

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే క్రమంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల్లా కాకుండా.. సాధారణ ప్రజల్లా అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల నుంచి చీత్కారాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. ఎంపీ చామల కిరణ్ …

Read More »

హైదరాబాద్: షవర్మా ఇష్టంగా తింటున్నారా..? అమ్మబాబోయ్, నమ్మలేని నిజాలు

హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా.. సికింద్రాబాద్లోని పలు షవర్మ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ముజ్ తాబా గ్రిల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షవర్మా సెంటర్ల నిర్వహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు …

Read More »

కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని.. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. పోలీసుల త్యాగాలు …

Read More »