తరచూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కునే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ చేసుకున్న విమర్శలు దాడులకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సైలెంట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఆదివారం (అక్టోబర్ 20న) …
Read More »స్కూల్ ఫీజు కట్టలేని స్థితి నుంచి.. ’70 కోట్ల టర్నోవర్’ స్థాయికి.. నిజామాబాద్ జిల్లా రైతు సక్సెస్’పూల’ స్టోరీ..!
Nizamabad Farmer Flower cultivation: కడుపేదరికం.. వ్యవసాయమే జీవనాధారం.. కానీ పంటలు పండకపోవటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదో తరగతి చదువుతున్న తాను స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో చదువు మానేశాడు. కుటుంబానికి సాయంగా ఉండాలని భావించాడు. ఆరోజున నెలకు వెయ్యి రూపాయలు జీతమొచ్చే పనిలో చేరిన ఆ కుర్రాడు.. నేడు సుమారు 200 మందికి పైగా జీవనోపాధి కల్పింటమే కాదు.. సంవత్సరానికి 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇది ఎక్కడో చందమామ కథల్లోనో.. పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్టోరీనో …
Read More »కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ …
Read More »టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు
ఆయనో జిల్లా కలెక్టర్.. పాలనా సంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం …
Read More »హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం.. బాధితులకు పరిహారం..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2-3 నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల …
Read More »మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మనుసులు గెలుచుకున్నారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ …
Read More »హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. చదరపు అడుగుకు ఇన్ని వేలా.. ఐదేళ్లలో మార్పు ఇదే..!
Property Prices Surge: రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో కాస్త ఈ రంగంపై ప్రభావం పడినా.. మళ్లీ కొన్నాళ్లకే ఊహించని రీతిలో పుంజుకుంది. ఇప్పుడు అడ్డూఅదుపు లేకుండా రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఇళ్లు, భూముల ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుతున్నా డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. నిత్యం కొత్త కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభం అవుతూనే ఉన్నాయి. వీటిల్లో బుకింగ్ ప్రాసెస్ కూడా గంటల్లో ముగుస్తోంది. అంతలా డిమాండ్ ఉంది మరి. గత …
Read More »తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు కీలక పదవి.. ఈసారి జాతీయ స్థాయిలో.. ఉత్తర్వులు జారీ..!
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది ఆ పార్టీ అధిష్ఠానం. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌కు కీలక అవకాశం కల్పించిన అధిష్ఠాటం.. ఇప్పుడు బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టింది. అయితే.. ఇందులో తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన ఎంపీ కె. లక్ష్మణ్‌ను బీజేపీ జాతీయ …
Read More »దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అడవికి ముప్పు నిజమేనా..?
Vikarabad Navy Radar Station: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న …
Read More »ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. కాలితో తన్ని మరీ.. కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆదివారం (అక్టోబర్ 13న) రోజు రాత్రి సమయంలో ఆలయంలో నుంచి శబ్దం రావటంతో మేల్కొన్న స్థానికులు.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం …
Read More »