తెలంగాణ

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి ‘హైడ్రా’ నోటీసులు..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. ఇక …

Read More »

నారా లోకేష్ ‘రెడ్ బుక్‌’కు N-కన్వెన్షన్‌ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్

ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ …

Read More »

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు హైదరాబాద్‌కు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావారణ కేంద్రం అధికారులు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం …

Read More »

గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి …

Read More »

హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!

రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి …

Read More »

అన్నకు రాఖీ కట్టిన చెల్లి.. కవితను చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. భావోద్వేగ దృశ్యాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న కవితను చూసి.. తన తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. దీంతో.. కవిత ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More »

జీతం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. ఉద్యోగం నుంచి తీసేశారు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే సీఎం రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు మెుర పెట్టుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా తన జీతం విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే జీతం విషయం దేవుడెరుగు ఉద్యోగమే తీసేశారని సదరు మహిళ వాపోయింది …

Read More »

హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది. కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ …

Read More »

రేవంత్ సర్కార్‌కు సవాల్..హీరో నాగార్జున?

హైదరాబాద్ మాదాపూర్‌లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్‌లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్‌ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం …

Read More »

పబ్లిక్‌లో అలా చేస్తే చుక్కలే.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

ప్రస్తుతం యువత పరిస్థితి ఎలా తయారైందంటే.. ఒక్క పూట తినకుండా అయినా ఉండగలరు కానీ.. సోషల్ మీడియా లేనిదే బతుకు భారమనేలా పరిస్థితి తయారైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నేటి యువత సోషల్ మీడియా వెనుక పరుగులు తీస్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షార్ట్స్, రీల్స్ అంటూ సెల్‍‌ఫోన్ పట్టుకుని చక్కర్లు కొడుతున్నారు. సరే ఎవరిష్టం వారిది అనుకున్నా.. తమ రీల్స్, షార్ట్స్ లైకుల కోసం మరీ తెగించేస్తున్నారు. ప్రాణాలకు తెగించి రిస్క్ చేసేది కొంతమంది అయితే.. పక్కోడి ప్రాణాలను …

Read More »