పిల్లలు తినడానికి మారాం చేస్తే.. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ తల్లులు గోరు ముద్దలు పెడుతుంటారు.. ఇది నిజం కాబోతోందని, చంద్రుడి భూమిపైకి వచ్చి దాదాపు రెండు నెలల పాటు ఉంటాడని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షం నుంచి ఒక గ్రహశకలం భూమిపైకి వస్తుందని.. అది గురుత్వాకర్షణ పరిధిలో సంచరిస్తుందని చెబుతున్నారు. నాసాకు చెందిన అట్లాస్ పరికరం ద్వారా ఆగస్టు 7న గుర్తించిన 2024 PT5అనే 10 మీటర్ల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 …
Read More »మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్
వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …
Read More »అంబానీ, అదానీ కానేకాదు.. దేశంలో బెస్ట్ కంపెనీగా ఆ టెక్ సంస్థ..!
ఈ సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరుతో లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలను చేర్చింది. టైమ్ బెస్ట్ కంపెనీల లిస్టులో ఈసారి భారత్ నుంచి మొత్తంగా 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, దేశీయ కంపెనీలలో బెస్ట్ కంపెనీగా ఏ అదానీ సంస్థనో, ముకేశ్ అంబానీ సంస్థనో ఉంటుందని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దిగ్గజ సంస్థలన్నింటినీ వెనక్కి నెట్టి ఓ …
Read More »వరదల్లో ప్రాణనష్టం తగ్గించడంలో విఫలం.. 30 మంది అధికారులకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రపంచం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోంది. విచిత్రమైన నిబంధనలు, కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సైతం ఆయనే నిర్ణయిస్తారు. ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు. కఠినమైన ఆంక్షలతో పాటు.. చిన్న చిన్న తప్పిదాలకే దారుణమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఇటీవల ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు కిమ్ సిద్ధమయ్యారు. …
Read More »వారికి శుభవార్త చెప్పి యూఏఈ.. భారత రాయబార కార్యాలయం కీలక మార్గదర్శకాలు
వీసా గడువు ముగిసినా తమ భూభాగంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు స్థానిక భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబరు 1న మొదలై అక్టోబరు 30 వరకు అమలులో ఉంటుంది. పర్యాటకులు, వీసా గడువు ముగిసిన వారు …
Read More »కీవ్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియం …
Read More »అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. 9 నెలల క్రితమే తండ్రి, ఇప్పుడు కొడుకు..!
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లాడు. అయితే.. తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవటంతో.. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ.. ఇంతలోనే రాజేష్ చనిపోయాడన్న విషాద వార్త కుటుంబాన్ని …
Read More »రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …
Read More »అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..
పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …
Read More »వినేష్ ఫొగాట్‌కు బిగ్ షాక్.. రజత పతకం చివరి ఆశలు కూడా గల్లంతు
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్ పారిస్ …
Read More »