ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని …
Read More »ఏపీలో వరద బాధితులకు భారీ విరాళం.. ఏకంగా రూ.120 కోట్లు
ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రంగాలకు అతీతంగా వీఐపీలు, వీవీఐపీలు తమకు తోచిన రీతిలో బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, విశ్వక్ సేన్ వంటి హీరోలతో పాటుగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అశ్వనీదత్ వంటి నిర్మాతలు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళాలు కూడా అందించారు. అయితే తాజాగా …
Read More »ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే …
Read More »విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్
విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …
Read More »విజయవాడ వరదల్లోనే ప్రసవించిన మహిళ.. స్వయంగా రంగంలోకి దిగిన సీపీ
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి.. బాధితులకు భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరీ వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే …
Read More »రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ కోటి.. ఏపీకి అశ్వనీదత్, ఆయ్ టీం విరాళం
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు …
Read More »ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు
ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరో ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు. ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ …
Read More »తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సాయం.. అశ్వినీదత్ భారీగా, ఎంత ప్రకటించారంటే!
తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరించారు.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె …
Read More »గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్
గుడివాడ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం రోజు గుడివాడ వెళ్లిన పేర్ని నానిని జనసేన నేతలు అడ్డుకున్న సంగతి తెలిసందే. గతంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. పోలీసులు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. అయితే తాజాగా పేర్ని నాని మచిలీపట్నం పోలీస్టేషన్‌లో తన డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు. పేర్ని …
Read More »విజయవాడ వరద బాధితులకు అండగా దివీస్ సంస్థ.. రూ.2.5 కోట్లతో..!
భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం నీటమునిగి అస్తవ్యస్తం అయ్యాయి. ఇక ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం.. తిండి, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి.. వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫార్మా కంపెనీ అయిన దివీస్ ల్యాబ్స్ కూడా రంగంలోకి దిగింది. భారీ వరదలతో అతలాకుతలం అయిన బెజవాడ నగరానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal