తిరుపతి

తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి

తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయాల్లోని హుండీలలో కానుకలుగా వచ్చిన కెమెరాలను దక్కించుకునే అద్భుత అవకాశం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటుచేసిన హుండీల ద్వారా భక్తులు ఆ స్వామికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం ఆరు లాట్లను ఆగస్ట్ 28న వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట్ 28న నిర్వహించే టెండర్ …

Read More »

శ్రీవారి మెట్టు మార్గంలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం..

తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద ఓ మహిళ, మరో యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సిబ్బందికి తెలియజేశారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరినీ కిందకు దించారు. అనంతరం అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన జంటను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. దర్శన టికెట్లు, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్ల నవంబరు నెల‌కు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

టీటీడీ ఛైర్మన్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి.. ఏపీ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ వైరల్, 25మందికి పదవులు!

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయం అయ్యాయంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం …

Read More »

నకిలీ టికెట్లతో తిరుమల దర్శనం.. 4 టికెట్లకు రూ.11 వేలు.. సిబ్బంది చేతివాటం

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది తిరుపతికి వస్తారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగా.. చాలా మంది సర్వదర్శనానికే వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే సర్వదర్శనానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. అయితే టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు.. తిరుమలలో రద్దీ చూసి భయపడి దళారులను ఆశ్రయించి.. అధిక ధరలకు టికెట్లు కొంటూ ఉంటారు. కొన్నిసార్లు నకిలీ టికెట్లు కొని మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా భక్తుల వీక్‌నెస్‌ను …

Read More »

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …

Read More »

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్‌ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్‌ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …

Read More »

Tirumala: శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ.. ఈ హుండీ ప్రత్యేకతలు ఇవే!

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆ వడ్డీకాసులవాడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంత మంది తమకు వీలైనంత మేరకు ధన, వాహన, వస్తు రూపేణా శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసే టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందిస్తుంటారు. ఇంకొంతమంది తిరుమల ఆలయానికి నగలు, వస్తువులు బహుమానంగా అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహుమతిగా అందింది. కొప్పెరవారిపల్లికి చెందిన కామినేని శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి కుప్పెర …

Read More »