ఆంధ్రప్రదేశ్

విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు.. ఆయనకే చీఫ్ బాధ్యతలు, మరో ఇద్దరు IPSలు

తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతర అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిట్‌ చీఫ్‌గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో పాటు తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి …

Read More »

ఏపీలో వారందరికి ఉద్యోగాలు.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల కామన్‌ పూల్‌లోని ఖాళీల్లో నియమించే అంశంపై.. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్‌ ఉద్యోగులు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ …

Read More »

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.10వేలు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరద బాధితులకు నేడు సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ప్యాకేజీని అందజేస్తోంది. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పలువురు వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేస్తారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ఉన్నారు. ఇవాళ ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను బాధితులకు సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు. అలాగే ఇళ్లు, షాపులు, వాహనాలు, పంటలు, పశువులు, తోపుడు …

Read More »

ఏపీలో తొలి వందే మెట్రో.. ఆ రూట్లో పరుగులు..!

రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తేనుంది. తాజాగా వందే మెట్రో పేరుతో తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా కొత్త రైలును కూడా ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. …

Read More »

పిలిచి సీటిచ్చిన వైఎస్ జగన్‌కు షాకిచ్చిన కృష్ణయ్య.. అసలు కారణాలు ఇవేనట..

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా చేసిన కృష్ణయ్య లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. మరోవైపు ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ, ఇలా అయితే కష్టమే..!

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. …

Read More »

తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్.. తెలంగాణ భక్తురాలి ఆరోపణపై టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. …

Read More »

తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..

తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో …

Read More »