దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్‌గేట్స్‌తో చంద్రబాబు చర్చించారు. 40 నిమిషాల పాటు వీళ్లిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ బిల్‌గేట్స్‌తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ …
Read More »శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే ఆర్జిత సేవా టికెట్ల జూన్ కోటా విడుదల.. ఇలా బుక్ చేస్కోండి..
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మంగళవారం (మార్చి 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో …
Read More »AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, యువ మేధావి సిద్ధార్థ్ నంద్యాలను అభినందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కలుసుకున్నారు. కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ ‘సిర్కాడియావి’ని సిద్ధార్థ్ అభివృద్ధి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 14 ఏళ్ల సిద్ధార్థ్ ఒరాకిల్, ARM లచేత గుర్తింపు పొందిన AI నిపుణుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హృదయ సంబంధ వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో విప్లవాత్మకంగా …
Read More »నీట్ పీజీ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే?
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) NEET-PG 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కంప్యూటర్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై ఆన్లైన్ విధానంలో NEET-PG 2025ను నిర్వహిస్తుందని తెలిపింది. బోర్డు ఇలా NEET-PG పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం..నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్‌గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2025 పరీక్ష …
Read More »పోసాని కృష్ణమురళికి మరో షాక్… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు కాజేశాడని టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ, మహేశ్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు. డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి తన …
Read More »ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలతో శ్రీవారి దర్శనం ఎప్పుడంటే…? గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా …
Read More »ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఏమన్నారంటే?
ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ …
Read More »చదువు ‘కొన’లేక చంపేశాడు.. ప్రొఫెషనల్ కిల్లర్‌లా.. కాకినాడ కేసులో కొత్త విషయాలు..
కాకినాడ లో మూడు మరణాలు కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు.. పక్కా ప్లాన్ ప్రకారం చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలను చంపి , తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. దానికి కావలసిన తాళ్లు ముందుగానే రెడీగానే ఉంచుకున్నాడు చివరిగా భార్యకి మిస్ యు అని మెసేజ్ చేశాడు.కాకినాడలో హోలీ పండుగ రోజు విషాదం జరిగింది. ఓఎన్జిసి ఉద్యోగి చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలు జోషిల్,నిఖిల్‌లను కసాయిగా మారి కడతేర్చాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత కొడుకులను ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌లాగా …
Read More »అమరావతికి మరో తీపికబురు.. ఇకపై రాజధాని పనులు మరింత వేగం..
అమరావతి నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నవ్యాంధ్ర రాజధానికి రుణం అందించేందుకు హడ్కో ముందుకు వచ్చింది. ఈ నిధులతో ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతోంది? రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా.. అమరావతి పరుగులు పెడుతోంది. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు బ్యాంక్‌లు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తోంది. తాజాగా మరో …
Read More »ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర …
Read More »