ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత.. సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్ బస్తీ స్థానంలో ఓడిపోయారు. ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర …
Read More »నీట్ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతేడాది నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే..దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్ …
Read More »టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ
టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది..రైల్వే శాఖలోని ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6, 2025వ తేదీతో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. …
Read More »వామ్మో హడలెత్తిస్తున్న మరో వైరస్.. GBS వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆ మహిళకు సిండ్రోమ్ ఎలా సోకిందనే దానిపై వైద్య శాఖ ఆరా తీస్తోంది.. జీబీఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఇప్పుడు మరో మరో వైరస్ కలకలం రేపుతోంది. …
Read More »భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాము. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు. మహాకుంభ్‌లో ఉత్సవం …
Read More »డేటా ఇంజినీరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?
యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించే ప్రయత్నంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ.. శ్రీ సత్యసాయి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును ప్రారంభిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజనీరింగ్ రంగంలో దూసుకుపోవడానికి అవసరమైన నైపుణ్యాలతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది.. నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డేటా ఇంజినీరింగ్ …
Read More »బిగ్ అలర్ట్.. తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు!
GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే …
Read More »సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
జాయింట్ సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను …
Read More »రైల్వేలో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో RPF కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. గతేడాది ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చినా .. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్ డేట్ లు వెలువడకపోవడంతో అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయడంతో వీరి ఎదురు చూపులకు తెరపడినట్లైంది..దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ నియామకాలకు …
Read More »బాలయ్యకు పద్మభూషణ్.. ఇంటి కెళ్లి అభినందనలు తెలిపిన కిషన్ రెడ్డి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ నందమూరి హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.సినీ నటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్‌లో బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన కేంద్రానికి …
Read More »