ఈశా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈశా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై …
Read More »BSNL వార్షికోత్సవ ఆఫర్.. వారందరికీ ఉచితంగా 24జీబీ డేటా.. ఎలా పొందాలంటే?
Free Data: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో బంపర్ ఆఫర్‌తో వచ్చింది. ఇప్పటికే టారిఫ్ పెంపు పోటీలో ప్రత్యర్థి సంస్థలకు మేకులా తయారైన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఉచితంగా 4జీ డేటా అందిస్తుండడం గమనార్హం. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లను ప్రకటిస్తోందీ. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతోంది. కొద్ది రోజుల్లోనే 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు అదిరిపోయే …
Read More »సన్యాసమా? పెళ్లా? మేము ఏదీ చెప్పం.. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలకు సుద్గురు సమాధానం
తన కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన సద్గురు జగ్గీవాసుదేవ్.. మిగతా మహిళలను సన్యాసినులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఇటీవల మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈశా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి.. సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69) హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈశా ఫాండేషన్ వ్యవస్థాకులు, సద్గురు జగ్గీవాసుదేవ్‌ను ప్రశ్నించింది. తాజాగా, హైకోర్టు ప్రశ్నలకు …
Read More »విద్యుత్ వాహనాల సబ్సిడీ స్కీమ్ షురూ.. 2 వీలర్లకు రూ.10 వేలు రాయితీ
PM E-Drive: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా టూ-వీలర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం, ఛార్జింగ్ వసతులు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్దికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రారంభించింది. రూ. 10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలిపింది. …
Read More »సుప్రీం వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్.. అలా అనలేదన్న డిప్యూటీ సీఎం
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో తాము చెప్పిందే నిజమైందని.. సత్యమేవ జయతే అంటూ వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ స్పందించారు. …
Read More »రైల్వే నుంచి రూ.283 కోట్ల కొత్త ఆర్డర్.. ఫోకస్‌లోకి స్టాక్.. లక్ష పెడితే రూ.20 లక్షలు!
ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ప్రాజెక్టును తక్కువ బిడ్డింగ్ చేసి దక్కించుకున్నట్లు తెలిపింది. ఒడిశాలో నిర్మాణ పనుల ప్రాజెక్టుగా తెలిపింది. ఈ ఆర్డర్ విలువ రూ. 283.69 కోట్లుగా ఉంటుందని తెలిపింది. రానున్న 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ మేరకు స్టాక్స్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇవాళ మార్కెట్ ముగిసిన తర్వాత …
Read More »కర్ణాటక సీఎంపై ఈడీ కేసు.. సిద్ధరామయ్య భార్య సంచలన నిర్ణయం
ముడా భూముల (MUDA Scam) వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి (BN Parvathi) కీలక ప్రకటన చేశారు. తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని …
Read More »ఐఐటీ, నీట్‌లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత …
Read More »ఆధునిక హంగులతో కొత్త ఎన్‌సీఏ.. బెంగళూరులో ప్రారంభించిన బీసీసీఐ
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్‌సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి …
Read More »భారీగా పెరిగి ఒక్కసారిగా పతనమైన అంబానీ స్టాక్స్.. మళ్లీ లోయర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు నష్టం!
Anil Ambani’s Reliance Shares: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. దిగ్గజ కంపెనీ స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ.. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG) షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల అప్పుల్ని తీర్చేయడం సహా నిధుల సమీకరణ వంటి ఇతర ప్రణాళికల నేపథ్యంలో.. గ్రూప్ స్టాక్స్ అన్నీ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. రిలయన్స్ పవర్ స్టాక్ ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ …
Read More »