పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …
Read More »కేరళ ప్రకృతి విలయంలో 43 మంది సమాధి..
మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సం ఇప్పటివరకు 43 మందిని పొట్టనబెట్టుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. …
Read More »జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్ దగ్గర హౌరా-సీఎస్‌ఎంటీ (ముంబై) ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికుకలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు బీహార్‌లో కూడా సోమవారం రైలు ప్రమాదం జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమస్తిపూర్ దగ్గర ఇంజిన్, రెండు బోగీల …
Read More »ఏపీలో వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు!
AP Rs 4 Lakhs For Construction Of House: ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) 2.0 పథకానికి సంబంధించి 2024-25 నుంచి అమలుచేయనున్న మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను ఎన్నికల ముందే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించి …
Read More »పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియమాకం.. తెలంగాణకు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం
పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గుర్ని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను ఝార్ఖండ్‌కు.కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్.విజయశంకర్‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు. రాజస్థాన్ …
Read More »ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు …
Read More »యంగ్ మినిస్టర్.. మీ నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్.. లోక్‌సభలో ఆసక్తికర దృశ్యం
కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ …
Read More »అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రకుట్ర..
Amarnath Yatra: దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువైన ఈ క్షేత్రానికి చేరుకునేందుకు.. యాత్రికులు దేశం నలుమూల నుంచి ఎన్నో అవస్థలు పడి వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఈ అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ.. ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు కుట్ర చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం వచ్చింది. …
Read More »మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్..
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం …
Read More »ఉత్తరాదిన దంచి కొడుతున్న వర్షాలు..
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, హిమాచల్, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుణెలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి చెందారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం …
Read More »