Recent Posts

OYO: తొలిసారిగా ఓయోకు కళ్లుచెదిరే లాభాలు.. ఏడాదిలో ఇన్ని వందల కోట్లా? ఓలాకు భారీ నష్టాలు!

OYO Revenue: ఐపీఓకు సిద్ధమవుతున్న ప్రముఖ స్టార్టప్ సంస్థ ఓయో.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 229 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా సంస్థకు లాభం రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు తాజాగా కంపెనీ యాన్యువల్ రిపోర్టులో వెల్లడించింది. అయితే ఈసారి తాము రూ. 100 కోట్ల లాభం అంచనా వేయగా.. దాన్ని మించినట్లు వివరించారు ఓయో ఫౌండర్ రితేశ్ అగర్వాల్. ఇక సర్దుబాటు చేశాక.. ఎబిటా 215 శాతం పెరిగి సుమారుగా రూ. 877 …

Read More »

ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా వారందరికి హైకోర్టు నోటీసులు.. మళ్లీ ఇదేం ట్విస్ట్!

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.

Read More »

40 కోట్ల మంది స్వాతంత్య్రం సాధిస్తే.. 140 కోట్ల మందితో వికసిత్ భారత్ సాధ్యమే.. మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే లక్ష్యంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘వికసిత్ భారత్’థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అప్పటికి భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఆ సమయానికి భారత్‌ను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంపికి చేసింది. ఈ ఏడాది వేడుకలకు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు లఖ్‌పతీ దీదీ, డ్రోన్‌ దీదీ వంటి పథకాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు …

Read More »