Recent Posts

ఏపీలోని ఓ సాధారణ గ్రామంలో గణపతి లడ్డూ వేలం.. లక్షల్లో పలికిన ధర

ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపం వద్ద జరిగిన వేలం పాటలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. శుక్రవారం నిమజ్జనానికి ముందు లడ్డూ, కలశం కోసం ప్రత్యేకంగా వేలం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్‌రెడ్డి లడ్డూను భారీ ధరకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండగ రోజున గణపతిని ఆరాధించిన తర్వాత, కొన్ని రోజులు గడిచాక నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయి. ఈ సందర్భంలో వినాయకుడి ప్రసాదంగా ఉంచిన లడ్డూలకు జరిగే వేలంపాటలు ప్రత్యేక …

Read More »

కరెన్సీ నోట్ల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న వినాయకుడు.. ఎన్ని కోట్లను ఉపయోగించారంటే..

మంగళగిరి ప్రధాన వీధిలోని మండపంలో గణపతిని నోట్ల తో అందంగా అలంకరించారు. వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం మంగళగిరిలోని వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ప్రతి ఏటా ప్రధాన వీధిలోని ఏర్పాటు చేస్తున్న విగ్రహం …

Read More »

మండపాల్లో వివిధ రూపాల్లో గణపయ్య.. ఆకట్టుకున్న ఆపరేషన్ సిందూర్, ఆపిల్, టెంకాయ గణేశ విగ్రహాలు..

దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. …

Read More »