Recent Posts

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. ఏపీలో కలకలం రేపుతున్న సంచలన వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. ఇందుకు సంబంధించి సంచలన వీడియో బయటపడింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపారు పలువురు రౌడీ షీటర్లు.. కోటంరెడ్డిని చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్ల మాస్టర్ ప్లాన్ రచించారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్‌ ఉన్నారు. మద్యం సేవించి ప్లాన్‌ గురించి చర్చించిన జగదీష్, …

Read More »

విశాఖలో మరో స్పెషల్ అట్రాక్షన్.. టూరిస్టులకు కావాల్సింది ఇదికదా..! సగం రేటుకే చుట్టేయొచ్చు..

విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ పర్యాటక బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్‌లో ప్రయాణించనున్నాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా …

Read More »

ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏడేళ్ల జైలు శిక్ష!

నిందితులను జైలు పంపించాల్సింది పోయి తానే జైలుపాలు అయ్యాడు ఓ పోలీసు అధికారి. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఓ సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు అవినీతి నిరోధక కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది ఏసీబీ కోర్టు. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు సబ్ ఇన్స్‌పెక్టర్. దీంతో బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా.. సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అతన్ని ఏసీబీ …

Read More »