Recent Posts

కార్యకర్తలకు అండగా ఉండాలి.. జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

సేనతో సేనాని.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి బాటలు పడాలి అంటున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. సాగరతీరం విశాఖలో మకాం వేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు పవన్ …

Read More »

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లిన క్రీడా ప్రోత్సాహకాలను రిలీజ్‌ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయడంలో రాష్ట్రంలోని క్రీడా కారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌ రవినాయుడు …

Read More »

ప్రధాని మోడీ మెచ్చిన అరకు కాఫీ గింజలతో.. యువకులు గణపతి విగ్రహం తయారీ..పోటెత్తుతున్న భక్తులు

ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ అందరి చూపును …

Read More »