Recent Posts

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. BJP ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేయటం సంచలనంగా మారింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం బయటకు రావటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేంద్రమంత్రి నడ్డా ఏపీ సీఎం చంద్రబాబును వివరణ కూడా కోరారు. పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. తాజాగా.. ఈ వివాదంపై …

Read More »

విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఛార్జీల వివరాలివే.. 60 కిమీ దూరానికి ఎంతో తెలిస్తే!

విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలపై క్లారిటీ వచ్చింది.. అయితే ఈ ఛార్జీలు సామాన్యులకు కాస్త భారంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60 కిలోమీటర్ల దూరానికి వందేభారత్‌లో ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.435 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.820గా ఛార్జీలు ఉన్నాయి. అదే సాధారణంగా ఆర్టీసీ డీలక్స్‌ బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. ఇలా చూస్తే.. వందేభారత్‌లో నాలుగు రెట్లు అధికం అంటున్నారు. విశాఖపట్నం నుంచి వందేభారత్‌ రైలు ఛార్జీల వివరాలు ఇలా …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. జాతీయస్థాయి నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల బాలాజీ భారత్‌పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని.. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ ప్రతి భక్తుడినీ ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఈవిషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై క్షుణ్ణంగా …

Read More »