Recent Posts

ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ.. పార్టీకి ఘంటా దంపతులు గుడ్ బై

ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. …

Read More »

వినాయకచవితికి బ్యాంక్ హాలిడే ఉందా? తెలుగు రాష్ట్రాల్లో శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

సెప్టెంబర్ 7. నెలలో తొలి శనివారం. మరి బ్యాంకులకు సెలవు ఉంటుందా? ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది కదా ఇలా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? బ్యాంకులకు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల్ని నిర్ధరిస్తుంటుంది. జాతీయ సెలవులు సహా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు.. ఇతర ప్రాంతీయ పండగల సందర్భంగా ప్రాంతాల్ని బట్టి సెలవులు మారుతుంటాయి. జాతీయ సెలవులు మాత్రం.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 26- గణతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం, …

Read More »

ఏపీకి బంగాళాఖాతంలో మరో ముప్పు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ముంచుకొస్తోంది.. ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9వ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా …

Read More »