Recent Posts

విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్

విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …

Read More »

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎదురు దెబ్బ.. అన్నంత పనిచేసిన చంద్రబాబు సర్కార్

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పినట్లుగానే జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు వస్తున్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు.. సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని.. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు చెబుతున్నారు. భీమిలిలోని సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన …

Read More »

విజయవాడ వరదల్లోనే ప్రసవించిన మహిళ.. స్వయంగా రంగంలోకి దిగిన సీపీ

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి.. బాధితులకు భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరీ వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే …

Read More »