Recent Posts

ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. రెండు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది.. ఆదివారం తెల్లవారుజాముకు వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. …

Read More »

ఏపీలో దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్లు మార్చిన ప్రభుత్వం.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. 2014-2019 టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉండేవి.. జగన్ సర్కార్ వాటిని దిశ పోలీస్ స్టేషన్‌లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దిశ చట్టానికి కేంద్రం …

Read More »

గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి …

Read More »