Recent Posts

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు …

Read More »

యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్

రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్‌ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …

Read More »

అదరగొట్టిన ఐపీఓలు.. తొలిరోజే 140 శాతం పెరిగిన షేరు.. ఒక్క లాట్‌పై ఏకంగా రూ. 21 వేల లాభం

మార్కెట్ల లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని ఐపీఓలు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే భారీగా పెరుగుతుంటాయి. ఇటీవల మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్ ఫ్లాట్ లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత వరుసగా 3 సెషన్లు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 79 వేల 500 …

Read More »