Recent Posts

కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు

పీసీ ఘోష్‌ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పబ్లిక్‌ డొమైన్‌లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్‌, హరీష్ రావు‌ పిటిషన్లపై రెండో రోజు వాదనలు కొనసాగాయి. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు… నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా.. అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం …

Read More »

డిప్యూటీ సిఎం ఇలాకాలో శ్రావణ శోభ.. పిఠాపురం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కనుక..

శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి. అంతేకాదు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తన నియోజకవర్గ ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకను అందజేస్తున్నారు. పాదగయ పుణ్యక్షేత్రం శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. చివరి శ్రావణ …

Read More »

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)లో చిరంజీవి ఒక పోస్ట్ షేర్ చేశారు. మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగులు జరగడం లేదు. తమ వేతనాలు 30% వరకు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళనక దిగడమే ఇందుకు ప్రధాన కారణం. …

Read More »