Recent Posts

వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.. అల్పపీడనాలకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలులేని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో వాతారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు, …

Read More »

పేదోళ్లకు నాణ్యమైన విద్య దక్కాలంటే మీలాంటి వాళ్లు కావాలి సార్ – విజయనగరం జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు

విద్యా హక్కు చట్టం (RTE) అమలులో తప్పులపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 25% సీట్లు కేటాయించాల్సిన నిబంధనలు ఉల్లంఘించిన ఆరు కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలలో సౌకర్యాల లేమి, అవకతవకలు గుర్తించడంతో విద్యా రంగంలో కలకలం రేగింది. అధికారుల దర్యాప్తు ఒత్తిడితో పాఠశాలలు వెనుకడుగు వేసి, నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చాయి.విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి షాక్ …

Read More »

ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు

ఎట్టకేలకు భక్తులను కరుణించిన పరమశివుడు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం నేటి నుండి ప్రారంభంకానుంది. భక్తుల కోరిక మేరకు ఉచిత స్పర్స దర్శనాలను దేవస్థానం అధికారులు మళ్ళీ ప్రారంభించారు. రోజుకు 1200 మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది, నూతన టోకెన్ సిస్టం ద్వారా ఉచిత స్పర్శ దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల …

Read More »