Recent Posts

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్‌ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …

Read More »

ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

కర్నూల్‌ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్‌ నుంచి విజయవాడకు …

Read More »

వాన వాన వెల్లువాయే.. తెలుగు రాష్ట్రాలు మురిసిపాయే.. ఈ జిల్లాలకు

ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం …

Read More »