Recent Posts

 తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. 

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫప్ట్, సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్ధులతోపాటు మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన వారికి కూడా ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in  లేదా results.cgg.gov.inలలో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Read More »

సర్కార్ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం యేటా మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..కేంద్ర ప్రభుత్వం యేటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత …

Read More »

రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

రుతు పవనాల ప్రభావంతో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు పడుతున్నాయి.దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని …

Read More »