Recent Posts

పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరం. వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బటన్ పుట్టగొడుగుల వంటి కొన్ని పుట్టగొడుగులను పచ్చిగా …

Read More »

డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. మార్క్రామ్ కీలక ఇన్సింగ్స్‌తో 27 ఏళ్ల కల సాకారం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా అందించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా, ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్ లక్ ముద్రను చెరిపేసుకుంది. ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ (136) నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (66)తో కలిసి 147 పరుగుల కీలక భాగస్వామ్యంతో 27 ఏళ్లను సుగమం చేశాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. శనివారం సౌతాఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారి …

Read More »

దూకుడుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్

తెలంగాణలో స్థిరాస్తి రంగం మళ్లీ ఊపందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం 17.72 శాతం వృద్ధి నమోదైంది. దీనితో ఈ రంగం పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది పోలిస్తే గణనీయమైన వృద్ధి 2023, 2024లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ప్రభావంతో స్థిరాస్తి రంగం కొంత మందగించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, ప్లాట్ల కొనుగోలు, …

Read More »