Recent Posts

YSRCP: ఫ్యాన్ పార్టీకి షాకుల మీద షాకులు.. మరో కీలక నేత గుడ్ బై..

ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పిఠాపురంలో పెండెం దొరబాబు, అనంతపురంలో పైలా నర్సింహయ్య రాజీనామాలు చేసిన ఘటనలు మరువకముందే మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఇకపై దూరంగా …

Read More »

గుడ్‌మార్నింగ్‌ కాదు జై హింద్.. ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో మార్పు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. పాఠశాలల్లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో …

Read More »

హైదరాబాద్ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆ రూట్‌లో ప్రత్యేక సర్వీసులు

హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్‌ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ నుంచి ప్రతిరోజు …

Read More »