Recent Posts

కాల్పులతో దద్దరిల్లిన జమ్ముకశ్మీర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

జమ్ముకశ్మీర్ బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.. దీంతో బలగాలు అప్రమత్తమై ఉగ్రవాదుల కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టారు.. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్ముకశ్మీర్‌ మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూల్గాంలో …

Read More »

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సమావేశాల నుంచి బయటకు వచ్చి ఓ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇంతకీ ఆ పాప ఎవరు?అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే వాటిని చూసేందుకు ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. మన ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి, చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో విద్యార్థులకు తెలిపేందుకు ఆయా …

Read More »

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »