Recent Posts

కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. జమ్మికుంటలో ఆగనున్న ఆ మూడు రైళ్లు..

ఎట్టకేలకు జమ్మికుంట వాసుల కోరిక నెరవేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జమ్మికుంట ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంత …

Read More »

భాగ్యనగరానికి అమిత్ షా.. తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరం గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అమిత్ షా స్వామి కార్యంతో పాటు పార్టీ కార్యం కూడా పూర్తి చేసే ప్లాన్ తో వస్తున్నట్ల తెలుస్తోంది. ఇంతకీ షా సడెన్ సౌత్ ట్రిప్ కు కారణమేంటి..? తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా? సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాబోతున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి …

Read More »

‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు …

Read More »