Recent Posts

ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే… కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై…. ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్‌, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు. తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్‌ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ …

Read More »

దుర్గమ్మ భక్తులకు అలర్ట్‌.. ఇకపై అవి పాటించకపోతే ఆలయంలోకి నో ఎంట్రీ!

దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్నారా అయితే ఇకపై కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయానికి వచ్చే స్త్రీలైనా, పురుషులైన ఈ నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే వారికి ఎంట్రీ ఉండదని.. వచ్చిన దారిలోనే వారు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఏంటీ కొత్త నిబంధనలు తెలుసుకుందాం పదండి. ఇంద్రకీలాద్రి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆలయానికి వచ్చేటప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. …

Read More »

తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివితేనే లోకల్ కోటా వర్తింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో స్థానికంగా ఇంటర్‌ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే మెడికల్ కాలేజీ కోర్సుల ప్రవేశాల్లో 85 శాతం స్థానిక కోటా అమలు చేస్తామని గతంలో సర్కార్‌ జీవో 33ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో శాశ్వత స్థానికులకు వర్తించదని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని సమర్థిస్తూ తాజాగా అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా కింద మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించాలంటే 12వ తరగతికి …

Read More »