Recent Posts

కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత.. చంద్రబాబు కండిషన్స్‌కు ఓకే చెప్పి, ఆ లేఖ పంపి మరీ!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్ వైఎస్సార్‌సీపీకి, మున్సిపల్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేశారు. తన ఛైర్మన్‌ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్‌ తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని.. ఆయన వెంట కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా …

Read More »

HYD: బాలుడి ప్రాణం తీసిన బడి గేటు.. విరిగిపడటంతో ఒకటో తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు మీద పడటంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం (నవంబర్ 4) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, సరోజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ (6) హయత్‌నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం …

Read More »

కోనసీమ కుర్రోడు, కెనడా అమ్మాయి.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఆ ఊర్లో సందడే, సందడి

తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. అక్కడి అమ్మాయి, అబ్బాయిల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలు దాటింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అబ్బాయి.. కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని …

Read More »