Recent Posts

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.. నవంబర్‌ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు …

Read More »

ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు వెళ్లాల్సిన 60 విమానాలు రద్దు

విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ కంపెనీ షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్‌లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు టికెట్‌ డబ్బులు రిటర్న్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య భారత్‌ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్‌ …

Read More »

చంద్రబాబూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపరేంటి: వైఎస్ జగన్ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి …

Read More »