Recent Posts

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అడవికి ముప్పు నిజమేనా..?

Vikarabad Navy Radar Station: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న …

Read More »

టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఈ రంగాలకే ఫుల్ డిమాండ్!

Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్‌క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, …

Read More »

లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర …

Read More »