Recent Posts

పవన్ కళ్యాణ్ లాగే మరో హీరోకు డిప్యూటీ సీఎం.. హింట్ ఇచ్చిన ముఖ్యమంత్రి

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్.. ఎన్నిక కానున్నట్లు గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికార ద్రవిడ మున్నేట్ర కజగం – డీఎంకే పార్టీ నేతలు అయితే తమ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాట్లాడిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మంగళవారం ఒక హింట్ ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఉదయనిధికి డిప్యూటీ …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ, ఇలా అయితే కష్టమే..!

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. …

Read More »