Recent Posts

నెల్లూరులో పరువు హత్య కలకలం.. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌తో, మిస్సింగ్ కేసు హత్యకేసుగా!

నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ మిస్టరీ వీడింది. చివరికి మిస్సింగ్ కాస్తా హత్యకేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఘటన కలకలంరేపింది. కొడవలూరు మండలం పద్మనాభునిసత్రం పల్లిపాలెంకు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో …

Read More »

దక్షిణాఫ్రికాకు అఫ్ఘానిస్థాన్ షాక్.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం

ప్రపంచ క్రికెట్‌లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు అనామక జట్టుగా ఉన్న అఫ్ఘాన్.. ఇటీవల కాలంలో హేమాహేమీ జట్లను సైతం ఓడిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆ దేశ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. దక్షిణాఫ్రికా జట్టును మాత్రం షాక్‌కు గురి చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన అప్ఘానిస్థాన్.. రెండో వన్డేలో ఏకంగా 177 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే …

Read More »

జగన్‌కు తలనొప్పిలా మారిన మంత్రి నారాయణ పెట్టిన కేసు.. మరోసారి హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా.. రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ.. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు …

Read More »