Recent Posts

సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …

Read More »

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్‌ పాలసీ అడ్వైజర్‌ డా.అంజనా అగర్వాల్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ …

Read More »

రైతులకు సంకెళ్లు.. రేవంత్ సర్కార్ ఆగ్రహం.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్..

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్‌ఎస్సై , ఇద్దరు ఏఆర్‌ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తర్వులు …

Read More »