Recent Posts

ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్‌లో తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు.  ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ మూతపడ్డాయి. భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్‌లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ …

Read More »

ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య – పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత, దానిలో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్‌ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు వినియోగించే హెలికాప్టర్లలో సాంకేతిక, భద్రతా సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై అసలు ఆ హెలికాప్టర్‌ వాడొచ్చా లేదో వివరణ ఇవ్వాలన్నారు.

Read More »