Recent Posts

తెలుగు సీఎంలతో జలశక్తి శాఖ సమావేశంపై ఉత్కంఠ… బనకచర్లపై చర్చకు ససేమిరా అంటున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ దిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా, గోదావరి నది జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల …

Read More »

మిథున్‌రెడ్డిపై లుక్అవుట్ సర్క్యులర్‌ జారీ… విదేశాలకు వెళ్లకుండా ముందస్తు చర్యలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హై కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్ మిస్ అయింది. బెయిల్ పిటిషన్ డిస్ మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ సర్కులర్ జారి చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక …

Read More »

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో భారీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అసిస్టెంట్‌ సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఇందుకు సంబంధించి షార్ట్‌ నోటీస్‌ జారీ చేశారు. విద్యార్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను జులై 19వ తేదీ ఐబీ (IB) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.. భాతర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో …

Read More »